బహుగా ప్రార్ధన చేయుడి | BIBLE MISSION LETTERS | Devada’s Ayyagaru songs
బహుగా ప్రార్ధన చేయుడి – ఇకమీదట – బహుగా ప్రార్ధనచేయుడి
బహుగా ప్రార్ధనచేసి – బలమున్ సంపాదించి మహిలో కీడును
గెల్వుడి – దేవుని కెపుడు మహిమ కలుగనీయుడి || బహు ||
వాగ్ధానములు చూడుడి – దేవుని గ్రంధ వాగ్ధానములు జూడుడి =
వాగ్ధానములె జరుగవలసిన కార్యంబుల్ – వాగ్ధానములునమ్ముడి
ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి || బహు ||
విసుగుదల జెందరాదు – ప్రార్ధన నెరవేర్పు తత్ క్షణమెరాదు =
విసుగున్నచో సిద్ధి – వెనుకకే పోవును – వసియించుడి దేవుని
వాగ్ధానమున భటులవలె నిల్వుడి || బహు ||
సంశయము పనికిరాదు – లేశంబైన – సంశయము పనికిరాదు =
సంశయింపకదైవ – సన్నిధియందుమీ – యంశమువిడజెప్పుడి –
దానికి గొప్ప – యంశబట్టనీయుడి || బహు ||
సంతోషమందరారె – మనదేవుని సంస్తుతి చేయరారె – సంతోష
బలముచే – సర్వ కష్టములను – అంతరింపజేతుము – మనదేవుని
సంతోషపరచెదము || బహు ||
All the credit goes to the creator of the song
#biblemissionsongs
#BIBLEMISSION
#biblemission
#biblemissionsongswithlyrics
source