Vinare Yo Narulara Song Lyrics Andhra Kristava Keertanalu Telugu Christian Golden Hits Songs Jesus

Vinare Yo Narulara Song Lyrics for Telugu Christian

వినరే యో నరులారా – వీనుల కింపు విూర – మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుఁ డయ్యె – వినరే = అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును ॥వినరే॥

1. నరరూపుఁ బూని ఘోర – నరకుల రారమ్మని – దురితముఁ బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపత్రుఁడు – వినరే = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి -గి రయంబున ప్రభు – కరుణను గనరే ॥వినరే॥

2. ఆనందమైన మోక్ష – మందరి కియ్య దీక్ష – బూని తనమేని సిలువ – మ్రాను నణఁ చి మృతిఁ బొందెను – వినరే = దీన దయా పరుఁ – డైన మహాత్ముఁడు – జానుగ – యాగము సలిపిన తెరంగిది ॥వినరే॥

3. పొందుఁ గోరిన వారి – విందా పరమోపకారి – యెంద రెందరిఁ బరమా – నందపద మొందఁగఁ జేసెను – వినరే = అందమునన్ దన – బొంది సురక్తము – జిందెను భక్తుల – డెందము గుందఁగ ॥వినరే॥

4. ఇల మాయావాదుల మాని – యితఁడే సద్గురు డని – తలపోసి చూచి మతి ని – శ్చల భక్తిని గొలిచిన వారికి – వినరే = నిల జనులకు గలు-ములనలరెడు ధని-కుల కందని సుఖ – ములు మరి యొసఁగును ॥వినరే॥

5. దురితము లణఁప వచ్చి – మరణమై తిరిగి లేచి – నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగఁ జనె – వినరే = బిరబిర మన మం – దర మా కరుణా – శరనిధి చరణ మె – శరణని పోదము ॥వినరే॥